సతీదేవి ఊర్ధ్వదంత పంక్తి ఈ ప్రదేశంలో పడింది. ఈమె బాల బ్రహ్మేశ్వర స్వామి శక్తి.
జోగులాంబ మహాదేవి / రుద్రవీక్షణ లోచన //
అలంపురీస్థితా మాతా / సర్వార్ధఫలసిధ్ధిద //
అలంపూర్ ఎక్కడ ఉంది?
అలంపూర్ > కర్నూల్ దగ్గర > మహబూబ్ నగర్ జిల్లా > ఆంధ్రప్రదేశ్
అలంపూర్ మ్యాపు చూడండి.
హైదరాబాదు నుండి కర్నూలు వెళ్ళే దారిలో కర్నూలుకి 12 కి.మి ముందు వచ్చే అలంపూర్ అడ్డరోడ్ నుండి 10కి.మి ఎడమకు ప్రయాణిస్తే అలంపూర్ అనే చిన్న గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో వాయువ్య దిక్కున తుంగభద్రానది ఒడ్డున జోగుళాంబ అమ్మవారి గుడి ఉంది.
దగ్గరలోని బస్ స్టాండ్: అలంపూర్
దగ్గరలోని రైల్వే స్టేషన్: కర్నూలు
దగ్గరలోని ఎయిర్ పోర్ట్: హైదరాబాద్
| First | Previous | Next |
జోగుళాంబ గుడి:
పాతకాలం నాటి జోగులాంబ గుడి 14 వ శతాబ్దంలో బహమని సుల్తాన్ల దాడిలో శిధిలమయినది. కాగా, అమ్మవారి విగ్రహాన్ని మరియు అమ్మవారి శక్తులయిన చండి మరియు ముండి విగ్రహాలను బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలో 2005 వరకు భద్రపరిచి ఉంచారు. ప్రస్తుతము శిథిలం కావించబడిన ప్రదేశంలోనే తిరిగి అమ్మవారి గుడిని పునర్నిర్మించారు. క్రొత్త గుడి చాల చక్కగా, అందంగా నిర్మించారు. అమ్మవారి గుడి చుట్టూ ఒక నీటి కోనేరు కట్టారు. ఆ గ్రామస్తులు చెప్పేదాని ప్రకారం జోగులాంబ అమ్మవారు చాలా ఉగ్రమయిన శక్తి స్వరూపిణి. కాబట్టి ఆ కోనేరు ఆమెను శాంత పరుస్తూంటుంది.
అలంపురం జోగులాంబ విగ్రహం చాలా విచిత్రం గా ఉంటుంది. ఈమె కుర్చోని ఉంటుంది. తలలో చాలా జుట్టు ఉంటుంది. ఆ జుట్టులో బల్లి, తేలు, గబ్బిలం మరియు మనిషి పుఱ్ఱె ఉంటాయి.
సప్తమాతృకల విగ్రహాలు, విఘ్నేశ్వరుడు, మరియు వీణాపాణి వీరభధ్రుడు విగ్రహాలు గుడిలో ఉన్నాయి. పూర్వకాలపు చండి మరియు ముండి విగ్రహాలు బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలోనే ఉంచారు. క్రొత్తవాటిని తయారు చేసి అమ్మవారి గుడిలో ప్రతిష్టించారు.
అలంపురంను City of temples అని పిలుస్తారు. ఈ ఊరులో పురాతనమయిన గుళ్ళు చాలా ఉన్నాయి. ఆ గుళ్ళు అన్ని కూడా శిల్పకళకు ప్రసిధ్ధి గాంచాయి. ప్రస్తుతం ఆ గుళ్ళు అన్నీ కూడా ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ వారి ఆధీనంలో ఉన్నాయి. అన్ని గుళ్ళు కూడా తుంగభద్రా నది ఒడ్డున ఉన్నాయి. వాటిలో నవబ్రహ్మ ఆలయాలు మరియు కంచి కామక్షి అమ్మవారి గుళ్ళు ముఖ్యమైనవి.
మరిన్ని వివరాలకు ఇంగ్లీషులో రాయబడిన పేజీ చూడండి.
