శక్తి పీఠాలు - తెలుగు ఫోరం

Last visit was: Sat Dec 16, 2017 6:41 pm

శక్తి పీఠాలు - తెలుగు ఫోరం

Postby Admin on Sat Oct 18, 2008 9:50 am

శక్తి పీఠాలు గురించి తెలుగు ఫోరం ఎందుకు ?

భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం ఇంగ్లీషులో కంటే సంస్కృతము ఇంకా మిగిలిన భారతీయ భాషలలోనే ఎక్కువగా లభ్యమవుతుందనేది నిర్వివాదాంశం. ఆ జ్ఞానంగానీ అటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తులుగానీ ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం పూర్తిగా సాధ్యం కూడా కాకపోవచ్చు. కొన్ని సందర్భాలలో అయితే అందంగా భావయుక్తంగా విషయాలను తెలియచేయడానికి ప్రాంతీయ భాషలు అత్యవసరం. ఈ శక్తి పీఠాలు తెలుగు ఫోరం అటువంటి కొరతలను తీర్చడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం.

తెలుగులో టైపు ఎలా చేయాలి ?

ఇక్కడ రాయడానికి కేవలం ఇంగ్లీషు కీబోర్డును వాడటం వస్తే చాలు. తెలుగు టైపింగు రావాల్సిన పని లేదు.
తెలుగు పదాలనే మీరు పలికే విధంగా ఇంగ్లీషులో టైపు చేయవచ్చు.
పోస్టింగు పేజీలో Smiles box కింద Telugu typing అని లింకు ఉంటుంది. దాన్ని నొక్కితే తెలుగు టైపింగు ఏరియా వస్తుంది.
అక్కడ మీరు మీరు రాయాలనుకున్న విషయాలను రాసి కాపీ చేసుకొని పైన ఉన్న సాధారణ టైపింగు ఏరియాలో వేయండి.
ఈ విధంగా రాసేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు కలిగితే అక్కడే ఉన్న Show Keypad కి టిక్కు పెట్టండి. మీకు టైపింగు సహాయం లభిస్తుంది.
తెలుగు టైపింగు వచ్చిన వాళ్ళు Phonetic నుండి Telugu Typewriter కి టైపింగు పద్ధతిని మార్చుకొని టైపు చేసుకొనవచ్చు.

తెలుగులో రాసిన విషయాలు మరింత చక్కగా కనపడటానికి [size=110] ను వాడండి.
ముఖ్య గమనిక:
రాయడము పూర్తి అయి, SUBMIT బటన్ నొక్కే ముందు మొత్తం కాపీ చేసుకోవడం మర్చిపోవద్దు (Press Ctrl+A and Ctrl+C).

తెలుగు టైపింగు సాఫ్ట్ వేర్

Postby Admin on Sat Jan 23, 2010 12:47 am

మీ కంప్యూటర్లోనే టైపింగు చేసుకొనేందుకుగాను సాఫ్ట్ వేర్ డౌన్ లోడు చేసుకొనండి : Link (Author: Gopi)

Topic Tags

Shakti peethas

  • NAVIGATION