శ్రీశైలం భ్రమరాంబ

Last visit was: Sun Oct 22, 2017 1:52 pm

శ్రీశైలం భ్రమరాంబ

Postby Siva on Mon Dec 22, 2008 8:46 pm

Imageభ్రమరాంబ / భ్రమరాంబిక అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం.

ఈ స్థానములో అమ్మవారి గ్రీవం [ కంఠం ] పడింది.
ఈవిడ మల్లికార్జునస్వామి యొక్క శక్తి.

శివపార్శ్వస్థితా మాతా / శ్రీశైలే శుభపీఠికే //
భ్రమరాంబా మహాదేవీ / కరుణారసవీక్షణా //


భ్రమరాంబ దేవిని ఎలా దర్శించాలి ?

ఆంధ్రప్రదేశ్ > కర్నూల్ జిల్లా > శ్రీశైలం
18 శక్తి పీఠాల మాపు
శ్రీశైలం మాపు

దగ్గర లోని బస్ స్టేషన్ : శ్రీశైలం
దగ్గర లోని రైల్వే స్టేషన్లు : మార్కాపురం రోడ్ , ఒంగోల్ , నంద్యాల
దగ్గర లోని ఎయిర్ పోర్ట్లు : తిరుపతి , విజయవాడ

భ్రమరాంబ దేవి గుడి మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగం లో ఉంది.
భ్రమరాంబ దేవి గుడి :

భ్రమరాంబ దేవి మూల విగ్రహం మహాలక్ష్మి రూపము లో ఉంటుంది.
గర్భగుడి లో అమ్మవారి విగ్రహం ముందు శ్రీయంత్రం ఉంది. భ్రమరాంబ దేవి ఫొటోలు చూడండి
అమ్మవారి గుడి పక్కన అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర అమ్మవారి విగ్రహం ఉంది

స్థల పురాణం :

భ్రమరాంబ అనగా భ్రమరాలకు తల్లి అని అర్ధం.
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు.
ఈవరం తో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్ధించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది.
తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతి ని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాక లో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

సాధన :

ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసములొ నవరాత్రులు జరుగుతాయి.
ప్రతి సంవత్సరం చైత్రమాసములో పౌర్ణమి తరువాత ముందుగా వచ్చే మంగళ లేదా శుక్ర వారం నాడు కుంభోత్సవం జరుగుతుంది. ఆనాడు అమ్మవారి కోసం కుంభరాశిగా నైవేద్యాన్ని సమర్పిస్తారు.

1. వాగ్బీజాక్షర మంత్రజపం
2. నవాక్షరి మంత్రజపం
3. సప్తశతి స్తొత్రపఠనం

Topic Tags

18 shaktipeethas, Andhra pradesh tourism, Dashara festival, Jyotirlingas tour, Temples in Andhra pradesh

  • NAVIGATION