ఉజ్జయిని మహాకాళి

Last visit was: Tue Jan 23, 2018 11:28 pm

ఉజ్జయిని మహాకాళి

Postby Siva on Fri Dec 26, 2008 11:26 pm

Imageఉజ్జయిని మహాకాళి [గఢకాళి /గఢకాళిక : ప్రాంతీయ నామము] అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. సతీదేవి పై పెదవి ఈ ప్రాంతంలొ పడింది. ఈమె మహాకాళేశ్వరుని శక్తి.

ఈమె మహాకవి కాళిదాసు యొక్క ఆరాధ్యదేవత.

ఉజ్జయిన్యాం మహాకాళి మహాకాళేశ్వరేశ్వరి /
క్షిప్రాతీరస్థితా మాతా వాంచితార్ధప్రదాయిని //


ఉజ్జయినిని ఎలా దర్శించాలి ?

మధ్యప్రదేశ్ > ఉజ్జయిని జిల్లా > ఉజ్జయిని
ఉజ్జియిని మాల్వాపీఠ భూమిలో కర్కాటక రేఖ పై ఉంది.
18 శక్తి పీఠాల మాపు
ఉజ్జయినిలోని గుళ్ళను చూపించే మాపు

దగ్గరలోని బస్ స్టేషన్: ఉజ్జయిని
దగ్గరలోని రైల్వే స్టేషన్:ఉజ్జయిని
దగ్గరలోని ఎయిర్ పోర్ట్: ఇండోర్

అమ్మవారి గుడి ఉజ్జియిని ఊరికి ఉత్తరాన భైరవ్ గడ్/భేరుగడ్ అనే ప్రాంతంలో క్షిప్రా నది తీరాన చిన్నగుట్ట మీద ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వం రత్నాచలం లేదా భైరవ పర్వతం అని పిలిచేవారు.

మహాకాళి గుడి :

గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి ఇరునైపులా మహాలక్ష్మి మరియు సరస్వతి విగ్రహాలు ఉన్నాయి. హనుమత్కేశ్వర్ అనే శినలింగం అమ్మవారి గుడి లో ఉంది. అమ్మవారి గుడి వెనుక భాగాన స్థిరమన్ గణేష్ గుడి కలదు. స్థిరమన్ గణేష్ గుడిలో సింహేశ్వర్ శినలింగం కలదు.

ఉజ్జయిని స్థలపురాణం :

స్కంధపురాణం లో మహాకాళిని రక్తదంతిక / చాముండగా వర్ణించారు

పూర్వం ఉజ్జయిని నగరాన్ని అంధకాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతనికి ఒక ప్రత్యేక మైన వరం ఒకటి ఉంది. అది ఏమిటంటే యుద్ధరంగంలో నేలకు తాకిన అతని ప్రతి రక్తపుచుక్క నుండి అంతటి శక్తివంతమైన ఒక రాక్షసుడు పుడతాడు. మహకాళేశ్వరుడు దేవతల ప్రార్ధన మీరకు అతనితో యుధ్ధం చేస్తాడు. మహావినాయకుడు /స్థిరమన్ గణేష్ అతనిని అదుపు చేస్తాడు. అప్పుడు శివుడు అంధకాసురుని హృదయమును త్రిశూలంతో ఛేదిస్తాడు. అప్పుడు చాలామంది అంధకాసురులు పుడతారు. అప్పుడు మహకాళి ఆవిర్భవించి ఆ అంధకాసురుని రక్తాన్ని అంతా తాగివేస్తుంది. ఆ తరువాత శివుడు అంధకాసురుని త్రిశూలంతో పైకిఎత్తి తన మూడో కన్నుతో దహిస్తాడు. చివరకి అంధకాసురుడు తన ఓటమిని ఒప్పుకొని శివుని ప్రార్ధిస్తాడు. దానికి సంతోషించిన శివుడు అతనిని క్షమించి భృంగిగా మార్చి గణాధ్యక్ష పదవిని ఇస్తాడు.

మహాకాళి సాధన :

ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసంలో నవరాత్రి ఉత్సవాలు చేస్తారు.
ఆషాఢ మాసంలోని మొదటి తొమ్మిది రోజులూ అమ్మవారికి ఇష్టమైన నవరాత్రులు.

1.కామ బీజాక్షర జపం
2.నవాక్షరి మంత్ర జపం
3.సప్తశతీ స్తోత్రపఠనం

Topic Tags

Jyotirlingas tour, Kali puja, Tantra goddess, Temples in Madhya pradesh, Travel Ujjain

  • NAVIGATION