పిఠాపురం పురుహూతిక

Last visit was: Tue Jan 23, 2018 11:27 pm

పిఠాపురం పురుహూతిక

Postby Rudraksha on Sun Jan 04, 2009 1:45 pm

పురుహూతిక / పురుహుత / పురుహుతాంబ అష్టాదశ శక్తిపీఠాలలొ ఒక శక్తిపీఠం.
సతీదేవి పీఠభాగం ఈ స్థలంలో పడింది. ఈమె కుక్కుటేశ్వరుని శక్తి

పురుహుతి సతీ మాత పీఠికాపుర సంస్థితా /
పుత్రవత్పాలితా దేవి భక్తానుగ్రహదాయిని //


పిఠాపురం ఎక్కడ ఉంది ?


 First Previous Next
Image
Image

ఆంధ్రప్రదేశ్ > తూర్పు గోదావరి జిల్లా > కాకినాడ దగ్గర > పిఠాపురం
శక్తిపీఠాల మ్యాపు
గోదావరి జిల్లాల గుడుల మ్యాపు

దగ్గరలోని బస్ స్టాండ్ : పిఠాపురం
దగ్గరలోని రైల్వే స్టేషన్ : పిఠాపురం , కాకినాడ
దగ్గరలోని ఎయిర్ పొర్ట్ : కాకినాడ , రాజమండ్రి , విశాఖపట్టణం

పూర్వం పిఠాపురం ను పీఠికాపురం గా పిలిచేవారు.
పురాణాలలో, తంత్రాలలో ఈ క్షేత్రాన్ని పుష్కర క్షేత్రం గా వర్ణించారు.

పురుహూతికా దేవి గుడి :

పురుహూతికా అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి గుడిలో ఈశాన్యభాగంలో ఉంది. కుక్కుటేశ్వర స్వామి గుడి ఊరి బయట కాకినాడ వెళ్ళేమార్గంలో ఉంది. ఇది చాలా పెద్ద గుడి. గుడిలోకి ప్రవేశించిన వెంటనే మనకు ఒక పెద్ద సరోవరం కనిపిస్తుంది.దానిని పాదగయ సరోవరం అని పిలుస్తారు. పర్యాటకులు ఈ పాదగయ లో స్నానాలు చేస్తారు. కుక్కుటేశ్వర స్వామి గుడి ఈ పాదగయ సరోవరానికి కుడి వైపు ఉంది. అమ్మవారి గుడి దక్షిణ దిక్కుకు తిరిగి ఉంటుంది. పురుహూతికా అమ్మవారి గుడి చిన్నదైననూ అష్టాదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కపడి చాలా అందంగా ఉంటుంది.

పురుహూతికా విగ్రహం :

పురుహూతికా విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఆ నాలుగు చేతులలో విత్తనాల [బీజాలు] సంచి , గొడ్డలి [పరశువు], కమలం, మధుపాత్ర ఉంటాయి. పూర్వకాలంలో ఈ అమ్మవారిని రెండు రకాల ఉపాసకులు పూజించేవారు. మొదటి వారు అమ్మవారిని పురుహూత లక్ష్మి గా భావించి కమలాన్ని మరియు మధుపాత్రను ధ్యానించేవారు. వీరు సమయాచరం లో పూజలు జరిపేవారు. రెండో వర్గంవారు పురుహూతాంబ గా భావించి బీజాలు మరియు పరశువుని ధ్యానించే వారు. వీరు వామాచారంలో పూజలు చేసేవారు. కొంతమంది చెప్పేదాని ప్రకారం పూర్వం పూజలు జరిగిన విగ్రహాన్ని భూమిలో పాతి దానిపై కొత్త గుడి కట్టారు.

పిఠాపురంలోని కొన్ని ముఖ్యమైన గుడులు :

పిఠాపురానికి సంభందించి చాలా కథలు ఉన్నాయి.
1. కుక్కుటేశ్వరస్వామి గుడి : ఇది పిఠాపురంలో ముఖ్యమైన గుడి
2. హుంకృతి దుర్గ / హుంకారిణి దుర్గ : ఈమె గర్భగుడిలో కుక్కుటేశ్వరస్వామికి ఎడమవైపు కలదు.
3. రాజరాజేశ్వరి దేవి : ఈమె కుక్కుటేశ్వరస్వామి దేవేరి. ఈమె కూడా అదే గుడి లో ఉంది.
4. శ్రీపాద వల్లభ దత్తాత్రేయులు :ప్రధాన గుడీకి నైరుతి దిక్కున గురు దత్తాత్రేయస్వామి గుడి ఉంది.
5. కుంతీ మాధవ స్వామి : బహుపురాతనమైన శ్రీకృష్ణుని గుడి పిఠాపురం గ్రామంలో ఉంది.

పురుహూతికా దేవి కథ :

పురుహూతికా దేవి పూర్వం ఇంద్రునిచే పూజింపబడింది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమమహర్షి భార్య అయిన అహల్యాదేవిని గౌతమమహర్షి రూపం ధరించి మోసగిస్తాడు. దానికి ప్రతిఫలంగా మహర్షి శాపం వల్ల ఇంద్రుడు తన బీజాలను కోల్పోయి శరీరం అంతా యోని ముద్రలు పొందుతాడు. దానికి బాధపడిన ఇంద్రుడు గౌతమ మహర్షిని ప్రార్ధిస్తాడు. ఆ ప్రార్ధనల వలన గౌతమమహర్షి కనికరించి ఆ యోని ముద్రలు కన్నులు లాగ కనిపిస్తాయని చెపుతాడు. అప్పటినుంచి ఇంద్రుడు సహస్రాక్షుడు అని పేరు పొందుతాడు. కాని ఇంద్రుడుకి బీజాలు పోయినాయి. వాటిని తిరిగి పొందటానికి ఇంద్రుడు స్వర్గాన్ని వదిలి జగన్మాత కోసం తపస్సు చేస్తాడు. చాలాకాలం తపస్సు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై ఇంద్రుడుకి సంపదను, బీజాలను ప్రసాదిస్తుంది. అప్పటినుంచి ఇంద్రుడుచే పూజింపబడుటవలన అమ్మవారిని పురుహూతికా అని పిలుస్తున్నారు.

చాలా కాలం తర్వాత పిఠాపురంలో దత్తత్రేయుడు శ్రీపాద వల్లభునిగా అవతరించి పురుహూతికా అమ్మవారిని పూజచేసి జ్ఞానాన్ని పొందాడు.

సాధన :

ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. పురుహూతికా దేవి పూజలో ఇంద్రుడుని ఋషిగా కుక్కుటేశ్వరస్వామిని గురువుగా స్వీకరిస్తారు.

Topic Tags

18 shaktipeethas, Dattatreya, Gaya, Temples in Andhra pradesh

  • NAVIGATION