ఈశ్వరుడు జీమూతకేతువు అనే రూపం ధరించడం

Last visit was: Sun Feb 18, 2018 1:20 am

ఈశ్వరుడు జీమూతకేతువు అనే రూపం ధరించడం

Postby Narmada on Mon Feb 21, 2011 5:19 pm

అథ శ్రీవామనపురాణమ్

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ।

ఒకటవ అధ్యాయము

త్రైలోక్యరాజ్యమాక్షిప్య బలేరిన్ద్రాయ యో దదౌ
శ్రీధరాయ నమస్తస్మై ఛద్మవామనరూపిణే // 1.1
పులస్త్యముషిమాసీనమాశ్రమే వాగ్విదాం వరమ్
నారదః పరిపప్రచ్ఛ పురాణం వామనాశ్రయమ్ // 1.2
కథం భగవతా బ్రహ్మన్ విష్ణునా ప్రభవిష్ణునా
వామనత్వం ధృతం పూర్వం తన్మమాచక్ష్వ పృచ్ఛతః // 1.3
కథం చ వైష్ణవనో భూత్వా ప్రహ్లాదో దైత్యసత్తమః
త్రిదశైర్యుయుధే సార్థమత్ర మై సంశయో మహాన్ // 1.4
శ్రూయతే చ ద్విజశ్రేష్ఠ దక్షస్య దుహితా సతీ
శఙ్కరస్య ప్రియా భార్యా బభువ వరవర్ణినీ // 1.5
కిమర్థం సా పరిత్యజ్య స్వరీరం వరాననా
జాతా హిమవతో గేహే గిరీన్ద్రస్య మహాత్మనః // 1.6
పునశ్చ దేవదేవవస్య పత్నీత్వమగమచ్ఛుభా
ఏతన్మే సంశయం ఛిన్ధి సర్వవిత్ త్వం మతోऽసి మే // 1.7
తీర్థానాం చైవ మాహాత్మ్యం దానానాం చైవ సత్తమ
వ్రతానాం వివిధానాం చ విధిమాచక్ష్వ మే ద్విజ // 1.8
ఏవభుక్తో నారదేన పులస్త్యో సునిసత్తమః
ప్రోవాచ వదతాం శ్రేష్ఠో నారదం తపసో నిధిమ // 1.9
పులస్త్య ఉవాచ
పురాణం వామనం వక్ష్యే క్రమాన్నిఖిలమాదితః
అవధానం స్థిరం కృత్వా శృణుష్వ మునిసత్త్మ // 1.10
పురా హైమవతీ దేవీ మన్దరస్థం మహేశ్వరమ్
ఉవాచ వచనం దృష్ట్వా గ్రీష్మకాలముపస్థితమ్ // 1.11
గ్రీష్మః ప్రవృత్తో దేవేశ న చ తే విద్యతే గృహమ్
యత్ర వాతాతపౌ గ్రీష్మే స్థితయోర్నౌ గమిష్యతః // 1.12
ఏవముక్తో భవాన్యా తు శఙ్కరో వాక్యమబ్రవీత్
నిరాశ్రయోऽహం సుదతీ సదారణ్యచరః శుభే // 1.13
ఇత్యుక్తా శఙ్కరేణాథ వృక్షచ్ఛాయాసు నారద
నిదాఘకాలమనయత్ సమం శర్వేణ సా సతీ // 1.14
నిదాఘాన్తే సముద్రభూతో నిర్జనాచరితోऽద్భుతః
ఘనాన్ధకారితాశో వై ప్రావృట్కాలోషతిరాగవాన్ // 1.15
తం దృష్ట్వా దక్షతనుజా ప్రావృట్కాలముపస్థితమ్
ప్రోవాచ వాక్యం దేవేశం సతీ సప్రణయం తదా // 1.16
వివాన్తి వాతా హృదయావదారణా గర్జన్త్యమీ లోయధరా మహేశ్వర
స్ఫురన్తి నీలాభ్రగణేషు విద్యుతో వాశన్తి కేకారవమేవ బర్హిణః // 1.17
పతన్తి ధారా గగనాత్ పరిచ్యుతా బకా బలాకాశ్చ సరన్తి తోయదాన్
కదమ్బసర్జ్జార్జునకేతకీద్రుమాః పుష్పాణి ముఞ్చన్తి సుమారుతాహతాః // 1.18
శ్రుత్వైవ మఘస్య దృఢం తు గర్జితం త్యజన్తి హంసాశ్చ సరాంసి తత్క్షణాత్
యథాశ్రయాన్ యోగిగణః సమన్తాత్ ప్రవృద్ధమూలానపి సంత్యజన్తి // 1.19
ఇమాని యూథాని వనే మృగాణాం చరన్తి ధావన్తి రమన్తి శంభో
తథాచిరాభాః సుతరాం స్ఫురన్తి పశ్యేహ నీలేషు ఘనేషు దేవ
నూనం సమృద్ధిం సలిలస్య దృష్ట్వా చరన్తి శూరాస్తరుణద్రుమేషు // 1.20
ఉద్వత్త్వేగాః సహసైవ నిమ్నగా జాతాః శశఙ్కాఙ్కితచారుమైలే
కిమత్ర చిత్రం యదనుజ్జ్వలం జనం నిషేవ్య యోషిద్ భవతి త్వశీలా // 1.21
నీలైశ్చ మేఘైశ్చ సమావృతం నభః పుష్షైశ్చ సర్జ్జా ముకులైశ్చ నీపాః
ఫలైశ్చ బిల్వాః పయసా తథాపగాః పత్రైః సపద్మైశ్చ మహాసరాంసి // 1.22
కాలే సురౌద్రే నను తే బ్రవీమి
గృహం కురుష్వాత్ర మహాచజలోత్తమే సునిర్వృతా యేన భవామి శంభో // 1.23
ఇత్థం త్రినేత్రః శ్రుతిరామణీయకం శ్రుత్వా వచో వాక్యమిదం బభాషే
న మేऽస్తి విత్తం గృహసంచయార్థే మృగారిచర్మావరణం మమ ప్రియే // 1.24
మమోపవీతం భుజగేశ్వరః శుభే కర్ణేऽపి పద్మశ్చ తథైవ పిఙ్గలః
కేయూరమేకం మమ కమ్బలస్త్వహిర్ద్వితీయమన్యో భుజగో ధనఞ్జయః // 1.25
సవ్యేతరే తక్షక ఉత్తరే తథా
నీలోऽపి నీలాఞ్జనతుల్యవర్ణః శ్రోణీతటే రాజతి సుప్రతిష్ఠః // 1.26
పులస్త్య ఉవాచ
ఇతి వచనమథోగ్రం శఙ్కరాత్సా మృడానీ ఋతమపి తదసత్యం శ్రీమదాకర్ణ్య భీతా
అవనితసమవేక్ష్య స్వామినో వాసకృచ్ఛ్రాత్ పరివదతి సరోషం లజ్జయోచ్ఛ్వస్య చోష్మ్ // 1.27
దేవ్యువాచ
కథం హి దేవదేవేశ ప్రావట్కాలో గమిష్యతి
వృక్షమూలే స్థితాయా మే సుదుఃఖేన వదామ్యతః // 1.28
శఙ్కర ఉవాచ
ఘనావస్థితదేహాయాః ప్రావృట్ఘనఖణ్డమున్నతమారుహ్య తస్థౌ సహ దక్షకన్యయా
తతోऽభవన్నామ తేదశ్వరస్య జీమూతకేతుస్త్వితి విశ్రుతం దివి // 1.30

ఇతి శ్రీవామనపురాణే ప్రథమోऽధ్యాయః


వామన పురాణము, ఒకటవ అధ్యాయము

Postby Uma on Wed May 04, 2011 7:48 am

ఓం గణనాథాయ నమః
జై తారా! జైజై సోమనాథ!!

సర్వసృష్టికి మూలమైన ఆదిశక్తికి నమస్కారము
సర్వకారణకారణుడైన ఆ జగత్పతికి ప్రణామము


ఒకనాడు మందరగిరిపై ఆశీనుడై ఉన్న శంకరుడిని సతీదేవి సమీపించి, నాథా! ఎంతో మనోహరమైన వసంతకాలం గడిచి దుస్సహమైన గ్రీష్మఋతువు ఏతెంచింది, ఈ సమయంలోనైనా మన నివాసానికి ఒక భవనము నిర్మించ ప్రయత్నించరాదా? అని మృదుమధురంగా పలికింది. దానికి శంభుడు చిరుమందహాసంతో, ప్రియా! నీకు తెలియనిది ఏముంది? నేను సహజంగానే నిరాశ్రయుడనై అరణ్యవాసము చేస్తూ ఉంటాను, దానికి భిన్నంగా ఎలా ఆలోచించగలను? అని ప్రశ్నించాడు. ఆ మాటలకు మారుపలుకలేక సతీదేవి, ఆ వేసవికాలమంతా మందరగిరిపై ఉన్న తరువుల నీడలలో భర్తతోపాటుగా గడిపింది.

ఆతరువాత కొంతకాలానికి దిక్కులన్నింటినీ దద్దరిల్లజేసే ధ్వనులతో లోకంపై పెనుచీకట్లని కప్పే మేఘాలగుంపుతో వర్షాకాలం విచ్చేసింది. దానిని గమనించిన దాక్షాయణి యోగాసనంలో స్థిరుడై కూర్చున్న పతిని చేరి, స్వామీ! దిక్కులన్నింటా జనసంచారం లేక కేవలం జలసంచారమే కనిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతులకైనను మిక్కిలి భీతిగొలిపే వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. మదమెక్కిన సింహాలవలే మేఘాలు గర్జిస్తున్నాయి. విద్యుల్లతలు జగజ్జేయమానంగా వెలుగుతూ భూమ్యాకాశాలని ఒక్కటి చేస్తున్నాయి. తమ అతిప్రియమైన ఋతువు ఆరంభమవటంతోటే నెమళ్ళు క్రేంకారాలతో వనాన్నంతా హోరెత్తిస్తున్నాయి. ఆకాశం నుండి ఎడతెరపిలేకుండా జలధారలు కురుస్తూ ఉన్నాయి. ఇక బలాక పక్షులు ఆకాశంలో ఒకచోట నిలువని మేఘాలవెంట పోటీలుపడుతూ ఎగురుతున్నాయి.

హోరున వీచే గాలివేగానికి ఆకస్మిక వైరాగ్యంతో సర్వమూ త్యజించే విరాగులవలే సర్జ, కదంబ, అర్జున, కేతకీ వృక్షాలు తమ తమ పుష్పాలని నిలువునా రాల్చేస్తున్నాయి. మేఘగర్జనలని ఆలకించి, తమ నివాసాలని వదిలివెళ్ళే యోగులకు మల్లే హంసలు కూడా తమ నెలవులైన సరోవరాలను విడిచిపెట్టేస్తున్నాయి.

శంభో! గమనించావా? ఈ లేళ్ళ గుంపులన్నీ కూడా అడవంతా పరుగులెడుతూ తమ తమ ప్రియతములతో ఇచ్చవచ్చినట్లు రమిస్తున్నాయి. అటు చూశావా? నల్లనిమేఘాల మధ్య ఆ తటిల్లతలు ఎంత భువనమోహనంగా ప్రకాశిస్తున్నాయో? నలువైపులా నీటిసమూహాలు నిండివుండటం చూసి శూరులు తరుణవృక్షాల మధ్యే తిరుగాడుతున్నారు. ఓ చంద్రశేఖరా! ఇప్పటివరకూ మందగమనంతో ఉన్న నదులన్నీ కూడా తమ గమనాన్ని ఉద్ధృతం చేశాయి. అనుజ్జ్వలుని సేవించిన యువతి అన్యచిత్తయగుటలో వింత ఏముంది? ఆకాశమంతా నీలిమబ్బులతో, వనమంతా సర్జవృక్షాల పుష్పాలతో కడిమిచెట్ల మొగ్గలతో బిల్వతరువుల ఫలాలతో, నదీనదాలు తమ జలాలతో, సరోవరాలు పద్మపత్రాలు పుష్పాలతో నిండి ఉన్నాయి. హే ప్రభూ! ఇంతటి అద్భుతమైన మరియు దుస్సహమైన కాలాన్ని మనము ఆనందంగా గడపటానికి ఈ గిరిశిఖరం మీద ఒక హర్మ్యము నిర్మించవచ్చుగదా! అని పలికింది.

తన హృదయేశ్వరి మాటలు విని ఆ శంకరుడు, ప్రియా! గృహసంపాదనానికి అవసరమైన ధనము నావద్ద లేదు. నా వేషభాషలని చూసినా నీకు అది సులభంగా అర్ధమైపోతుంది. నేను పులితోలుని వస్త్రంగా, పాపరేడుని తరిత్రాడుగా, పద్మ,పింగళులనే సర్పాలని చెవిపోగులుగా, కంబళ,ధనంజయాలనే నాగులని కేయూరాలుగా, అశ్వతర,తక్షకులను రెండుచేతులకు కంకణాలుగా, ఇంకా నల్లగా నిగనిగలాడే మహాసర్పం నీలుణ్ణి మొలతాడుగా ధరిస్తాను. ఇటువంటి నావద్ద ఇంతకుమించి ఏముంటుంది చెప్పు! అని పలికాడు.

అప్పుడు పులస్త్య మహాముని ఇలా పలికాడు:
ఆవిధంగా శివుడు ఒక సాధారణ గృహనిర్మాణాన్ని చేసుకోవటానికి కూడా తన అశక్తతని వెల్లడి చేయగా, ఆ మాటలు సత్యములైనప్పటికీ తనను ములుకులవలె బాధించగా సతీదేవి లజ్జతోనూ రోషంతోనూ చిగురుటాకువలే కంపిస్తూ నేలమీద చూపులు నిలిపి ఈవిధంగా అన్నది. కానీ ప్రాణేశ్వరా! ఇంతటి దుర్భరమైన వానాకాలాన్ని ఈ తరువుల క్రింద తడుస్తూ దుఃఖిస్తూ ఎలా గడపగలను? అందువల్లే నేను ఈ విధంగా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు శంకరుడు, ప్రియసతీ! ఇందులో బాధపడటానికి ఏమీలేదు. ఈ వర్షఋతువంతా మేఘాలపైనే మన నివాసం ఏర్పరుచుకొని నీ శరీరంపై ఒక్క నీటిచుక్క కూడా పడకుండా సంతోషంగా గడుపుదామని బదులిచ్చాడు.

అప్పుడు పులస్త్యుడు ఇలా పలికాడు:
ఆ వెంటనే శంకరుడు తన ప్రియురాలితో కూడి ఒక మహోన్నతమైన మేఘమండలాన్ని అధిరోహించి అక్కడ నివసించసాగాడు. ఆ కారణాన సర్వలోకాలలో శివునికి జీమూతకేతువు అనేపేరు సార్థకమయ్యింది.

Re: ఈశ్వరుడు జీమూతకేతువు అనే రూపం ధరించడం

Postby sudhamsu on Sun Jul 12, 2015 10:41 pm

Hello,
I would love to know if you have all the vamana puranam at one place in telugu. I was planning to copy the content from your posts one by one but wasn't sure if everything is there. I was planning on checking that anyway but wanted to confirm with you.
Thanks a lot.

Topic Tags

18 puranalu, Ashtadasa puranalu, Lord Shiva, Religious texts, Sanskrit documents, Vamana purana in telugu, Vamana purana online, Vamana purana text, Vamana puranam, Vamanavataram

  • NAVIGATION